ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో సాధారణ వేళల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు 10 గంటల సమయం పడుతోంది. ఇక, రద్దీ సమయాల్లో అయితే ఒక్కోసారి 24 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థిితి నెలకొంది. సాధారణంగా శ్రీవారి ఆలయానికి శుక్రవారం నుంచే భక్తుల రద్దీ పెరుగుతుంది. శని, ఆదివారాలు భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంది. మంగళ, బుధ, గురువారాలు భక్తుల తాకిడి కాస్త తక్కువగా ఉంటుంది. సగటున శ్రీవారిని రోజూ 50 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు.
వీఐపీ బ్రేక్ దర్శనానికి 2 గంటలు కేటాయిస్తున్నారు. స్వామివారి నిత్య కైంకర్యానికి 6 గంటల సమయం పడుతుంది. ఇక, సామాన్య భక్తుల దర్శనానికి మిగిలింది రోజులో 10 గంటలు మాత్రమే. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో తిరుమల సందడిగా మారుతుంది. అయితే, భక్తులకు త్వరగా దర్శనం అయ్యేందుకు టీటీడీ గతంలో అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అయినా, రోజురోజుకు పెరుగుతున్న భక్తులతో ఈ పథకాలు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి.
భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం అయ్యేలా చూస్తామని ఇటీవల దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మాణిక్యాలరావు చెప్పారు. అంతేకాదు, భక్తులకు 2 గంటల్లో శ్రీవారి దర్శనం అయ్యేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరి, నిజంగానే రెండు గంటల్లో శ్రీవారి దర్శనం అవుతుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుమలేశుడి దర్శనం 2 గంటల్లో అవడం అసాధ్యమే. మరి, మంత్రిగారు చెప్పినట్లు రెండు గంటల్లో దర్శనమయ్యేందుకు ఏం చేస్తారో వేచి చూడాలి మరి!
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు