Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్-మందా జగన్నాథం మూడు గంటల పాటు సుదీర్ఘ భేటీ!

టీఆర్ఎస్ లోకి మళ్ళీ వలసల పర్వం ప్రారంభమైనట్టే ఉంది. ఇంతకుముందు టీడీపీ, కాంగ్రెస్ నుంచి పలువురు గులాబీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ మందా జగన్నాథం సైతం టీఆర్ఎస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఆయన నేడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మూడు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అవడమే ఇందుకు నిదర్శనం. మరో రెండుమూడ్రోజుల్లో మందా టీఆర్ఎస్ కండువా ధరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ నుంచి మరో ముగ్గురు తెలంగాణ ఎంపీలు కూడా టీఆర్ఎస్ లోకి వెళ్ళేందుకు సానుకూలంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.

More Telugu News