హలీం తినాలంటే శిల్పారామానికి వెళ్లాల్సిందే!
హలీం రుచులను చవిచూపించేందుకు హైదరాబాదులో చాలా హోటళ్లు ఉన్నాయి కదా! శిల్పారామానికి వెళ్లడమేమిటి, అని అనుకుంటున్నారా? మీరు చదివింది కరెక్టే. ఈ నెల 11వ తేదీన హైటెక్ సిటీ సమీపంలోని శిల్పారామంలో హలీం ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1.30 గంటల వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. జీహెచ్ఎంసీ, తెలంగాణ హోటళ్ల సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. హైదరాబాదులోని ప్రధాన హలీం తయారీదారులు ఈ ఫెస్టివల్ లో పాల్గొని హలీం రుచులను అందించేందుకు సిద్ధమవుతున్నారు.