Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లోక్ సభలో 'జోగి'న రాహుల్ గాంధీపై సెటైర్లే సెటర్లు

ధరల పెరుగుదలపై చర్చ జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గాఢ నిద్రలోకి జారిపోయారు. ధరల పెరుగుదలపై లోక్ సభలో చర్చ చేపట్టాలని రాహుల్ గాంధీ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేశారు. స్పీకర్ తో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు ఆయన కోరినట్టే ప్రభుత్వం చర్చకు సమ్మతించింది. చర్చ జోరుగా సాగుతుండగా ఆయన మాంచి నిద్రలోకి జారుకున్నారు. దీంతో బీజేపీ నేతలు రాహుల్ పై విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించారు. కీలకమైన ధరల పెరుగుదలపై చర్చ జరుగుతుండగా నిద్రలోకి ఎలా జారుకుంటారని ప్రశ్నిస్తున్నారు. గత పదేళ్లలో నిద్రపోయిన కాంగ్రెస్ నేతకు ఇంకా నిద్ర సరిపోలేదా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలతో రక్షణలో పడిపోయిన కాంగ్రెస్ నేతలు ఆయన కళ్లు మూసుకుని చర్చను దీక్షగా వింటున్నారని వివరణ ఇస్తున్నారు.

More Telugu News