Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిరాశపరిచిన రైల్వేబడ్జెట్: ఎంపీ వినోద్ కుమార్

రైల్వే బడ్జెట్ దేశప్రజలను నిరాశకు గురిచేసిందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులు ఆశాజనకంగా లేవని ఆయన అన్నారు. పోలవరం ఆర్డినెన్సుపై రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో చర్చించాల్సి ఉందన్నారు. ఇవాళ రాత్రికి రాష్ట్రపతిని కలిసి అన్ని విషయాలు తెలియజేస్తామని వినోద్ కుమార్ చెప్పారు. రైల్వే బడ్జెట్ తమను బాగా నిరుత్సాహపరిచిందని ఎంపీ కవిత అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదన్నారు. పెద్దపల్లి-కరీంనగర్ రైల్వే లైను కేటాయిస్తే ప్రజలు సంతోషించి ఉండేవారని ఆమె అభిప్రాయపడ్డారు.

More Telugu News