నాయుడుగారి 'సౌత్ స్పెషల్స్' కు మోడీ పరమానందం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాయుడుగారి 'సౌత్ స్పెషల్స్' కు మోడీ పరమానందం

దోశెలు, ఇడ్లీలు, వడలు, గారెలు, ఉప్మా, పులిహోర అన్నీ దక్షిణాది స్పెషల్సే. రుచిగా వండాలే కానీ, లొట్టలెయ్యని వాళ్ళంటూ ఉండరు. ప్రధానమంత్రి అయినా సరే, ఆహా, ఓహో అనాల్సిందే. సరిగ్గా అదే జరిగింది ఢిల్లీలో. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. ఆయన వస్తారని ఎవరూ ఊహించలేదు. ప్రధాని రాక తెలిసి అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, ప్రకాశ్ జవదేకర్, సంతోష్ గంగ్వార్ తదితర కేంద్ర మంత్రులు కూడా వచ్చారు. దీంతో, అందరికీ కడుపునిండా కమ్మని ఉపాహారం పెట్టాలని వెంకయ్య నాయుడు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా స్థానిక శరవణ భవన్ హోటల్ నుంచి దక్షిణాది అల్పాహార వంటకాలను తెప్పించారు. ఇంకేముంది, అందరూ వాటిపై లంఘించారు. మోడీ సహా ప్రతి ఒక్కరూ వాటిని మెచ్చుకున్నారట. మోడీ అయితే, వెంకయ్యను పిలిచి... "ఈ వంటకాలు ఎక్కడి నుంచి తెప్పించారు?, చాలా బాగున్నాయి" అంటూ పరమానందభరితుడయ్యాడట. ఇక, వెంకయ్య విందు విషయం తెలిసి విలేకరులు కూడా పరుగెత్తుకు వచ్చారు. తమకూ అలాంటి విందే ఇవ్వాలని కోరగా, సర్కారీ ఖర్చుతో కాకుండా సొంత ఖర్చుతో విందు ఇస్తానని వెంకయ్య బదులిచ్చారు.

More Telugu News