బ్రిటన్ పార్లమెంటు ఎదుట మహాత్ముడి విగ్రహం
బ్రిటీష్ వలస పాలకులను తన అహింసా సిద్ధాంతంతో నిలువరించిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని బ్రిటన్ పార్లమెంటు ఎదుట ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న బ్రిటన్ ఆర్ధిక మంత్రి జార్జ్ ఆస్బర్న్ ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా, గాంధీకి బద్ధ విరోధిగా పేరుగాంచిన విన్ స్టన్ చర్చిల్ విగ్రహం కూడా పార్లమెంటు వద్ద కొలువై ఉంది.
చర్చిల్ 1940-1955 మధ్యకాలంలో రెండు పర్యాయాలు బ్రిటీష్ ప్రధానిగా వ్యవహరించారు. అప్పట్లో చర్చిల్ గాంధీని 'అర్థనగ్న ఫకీరు' అని అభివర్ణించారు. అంతేగాకుండా, నిరాహార దీక్ష చేస్తున్న గాంధీ చచ్చిపోతే బాగుండనని కూడా ఈ చర్చిల్ మహాశయుడు తలచాడట.