మంత్రి కామినేనితో కళాశాల యాజమాన్యాల భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తో ఏపీలోని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు సచివాలయంలో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా ప్రైవేటు వైద్య కళాశాలల్లో తగ్గిన సీట్ల సంఖ్యను, వనరుల లేమిని, ప్రభుత్వ నిబంధనలు, మరిన్ని సమస్యలను మంత్రికి వివరించాయి. సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా మంత్రిని పైవేటు కళాశాలల యాజమాన్యాలు కోరాయి.