ఏసీ పేలి నలుగురి మృతి
తమిళనాడులోని వేలూరులో ఎయిర్ కండిషనర్ పేలిన ఘటనలో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. పట్టణంలోని ఓ వ్యాపారవేత్త ఇంటిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఏసీ పేలుడు ఈ స్థాయిలో నలుగురి ప్రాణాలను బలితీసుకోవడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. హై ఓల్టేజీ కారణంగానే పేలుడు సంభవించిందని ప్రాథమిక అంచనా.