సీరియల్స్ చూస్తున్నారా... అయితే, మీ కాపురం కూలినట్టే!
ఆనందంగా సాగుతున్న వైవాహిక జీవితంలో లేనిపోని సమస్యలతో సతమతమవుతున్నారా? లేదా, భార్యా భర్తలు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారా? అయితే ఆలోచించాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. దాంపత్య జీవితంలో సమస్యలకు, టీవీ సీరియల్స్ కు సంబంధం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఆనందకరమైన జీవితంలో చిచ్చు రేపడానికి సీరియల్స్ కారణమని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో తేలిందని తెలిపారు.
ప్రతి రోజూ కచ్చితంగా సీరియల్ ను చూసే అలవాటు ఉంటే అది కచ్చితంగా వైవాహిక జీవతంపై ప్రభావం చూపుతుందని వారు స్పష్టం చేశారు. భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే సీరియల్స్ కు దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. జీవిత భాగస్వామి సీరియల్స్ చూస్తూ ఉంటే మాత్రం అది మీ దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రియాలిటీ షో లు చూస్తే దంపతుల మధ్య మంచి అవగాహన ఉంటుందని పరిశోధకలు తేల్చిచెప్పారు.