Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధోనీ ఓటు ఎవరికో..?

ఇంగ్లండ్ తో తొలి టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డైలమాలో పడ్డాడు. ఎల్లుండి ట్రెంట్ బ్రిడ్జ్ లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఇంగ్లండ్ పిచ్ లు స్పిన్ కు పెద్దగా అనుకూలించవన్న నేపథ్యంలో ఇద్దరు స్పిన్నర్లను తీసుకునే సాహసం ఏ జట్టూ చేయబోదు. ఇప్పుడా విషయంలోనే ధోనీకి చిక్కొచ్చిపడింది. తుది జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్ ను తీసుకోవాలా? రవీంద్ర జడేజాను తీసుకోవాలా? అన్న దానిపై కోచ్ ఫ్లెచర్ తో కలసి మల్లగుల్లాలు పడుతున్నాడు.
ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ లోనే కాకుండా బ్యాటింగ్ లోనూ ఉపయుక్తంగా ఉంటాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన జడేజా అయితే బ్యాటింగ్ లో పూర్. కానీ, బౌలింగ్ లో ఫరవాలేదనిపిస్తున్నాడు. ప్రస్తుతం అశ్విన్ ఫామ్ లో లేకపోవడంతో ఎవరివైపు మొగ్గాలో ధోనీకి చిక్కుప్రశ్నలా మారింది.
ఇంగ్లండ్ గడ్డపై రెండు ప్రాక్టీసు మ్యాచ్ లలోనూ వీరిద్దరి ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఒక ఇన్నింగ్స్ లో రాణిస్తే, మరో ఇన్నింగ్స్ లో విఫలమయ్యారు. వీరు కాకుండా జట్టులో మరో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం టీమ్ సెలక్షన్ పై ప్రభావం చూపనుంది.

More Telugu News