మన హైదరాబాదులో ఎంత మంది పొగరాయుళ్లున్నారో తెలుసా?
సరదా సరదా సిగరెట్టూ... దొరల్ తాగు భలే సిగరెట్టు అని సినీ రచయిత అన్న మాటలో నిజమెంత ఉందో అని యువతరం సిగరెట్లను తాగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఎంజాయ్ చేసే వాళ్లు హైదరాబాదు నగరంలోనే దాదాపు పది లక్షల మంది ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రోజుకు నాలుగు కోట్ల విలువ చేసే ఏడు లక్షల సిగరెట్లను ఊదిపారేస్తున్నారు. అగరొత్తుల పొగ కంటే సిగరెట్ల పొగ పవర్ ఫుల్ అంటూ, పొగరాయుళ్లు నెలకు 900 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు సిగరెట్లపై ఖర్చు చేస్తుండడం విశేషం.
దీంతో సిగరెట్ల కంపెనీలు వీరి బలహీనతలను ఆసరా చేసుకుని రకరకాల ఫ్లేవర్లలో వీటిని అందుబాటులోకి తెస్తూ వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించుకుంటున్నాయి. ఇలా ప్రభుత్వ ఖజానాకి కూడా 300 కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. అలా తాగుతున్న సిగరెట్లు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల ద్వారా నికోటిన్ లాంటి నాలుగు వేల రకాల విషతుల్యాలు శరీరంలోకి చేరుతున్నాయి.
పొగ రాయుళ్లలో 18 ఏళ్ల లోపు వారు 12 శాతం మంది ఉండగా, 18-40 ఏళ్ల లోపు వారు 42 శాతం మంది ఉన్నారు. 40-66 ఏళ్లలోపు వారు 30 శాతం మంది, 65-80 ఏళ్ల లోపు వారు 16 శాతం మంది ఉన్నారు. పురుషుల్లో పొగతాగే వారు 17 శాతం ఉండగా, మహిళల్లో 2.3 శాతం మంది పొగతాగుతున్నారు.
ఇందులో కూడా గోల్డ్ ఫ్లేక్ కింగ్స్ సిగరెట్లను 36 శాతం మంది, చిన్న గోల్డ్ ఫ్లేక్ 24 శాతం మంది, గోల్డ్ ఫ్లేక్ లైట్స్ 20 శాతం మంది, బ్రిస్టల్, ఫోర్ స్క్వేర్, చార్మినార్ వంటి బ్రాండ్లను 20 శాతం మంది ఊదేస్తున్నారు.