Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గత పదేళ్లలో పార్లమెంటు పరువు పోయింది... ఇప్పుడు చక్కదిద్దుకుందాం: వెంకయ్యనాయుడు

గత పదేళ్లుగా వివిధ అంశాలపై చెలరేగిన గందరగోళాలతో పార్లమెంటు ఉభయసభలు స్తంభించిపోయాయని, దీంతో పార్లమెంటుకు చెడ్డ పేరు వచ్చిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉత్పన్నమైన పరిస్థితిని ఇప్పుడు చక్కదిద్దుకుందామని విపక్షాలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈ ఉదయం ఆయన వివిధ పార్టీల నేతలకు అల్పాహార విందు సమావేశం ఏర్పాటు చేశారు. స్పీకర్ అనుమతితో ఎలాంటి అంశాన్నైనా చర్చిద్దామని చెప్పారు. పార్లమెంటు గౌరవాన్ని కాపాడేలా ఎంపీలందరూ ప్రవర్తించాలని విన్నవించారు.

More Telugu News