కలకాలం కలిసి నడుస్తానని చెప్పి..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కలకాలం కలిసి నడుస్తానని చెప్పి..!

ఆ కిరాతక భర్త పెళ్ళినాటి ప్రమాణాలను తుంగలో తొక్కాడు! కట్టుకున్న భార్యను ఆస్తి కోసం కడతేర్చాడు. అతనికి కుమారులు కూడా సహకరించడం డబ్బుపై మనిషి దురాశను తేటతెల్లం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిందీ దారుణం. ఆస్తి తమ పేరిట రాయాలంటూ మంగాదేవి (48) అనే మహిళపై గత కొంతకాలంగా ఆమె భర్త, పిల్లలు వేధింపులకు పాల్పడుతున్నారు. ఆమె నిరాకరించడంతో, గత రాత్రి క్రికెట్ బ్యాట్ తో తలపై మోది చంపేశారు.
భర్త, ఇద్దరు కుమారులు బ్యాట్ తో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలపాలైంది మంగాదేవి. ఆమెను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. మార్గమధ్యంలోనే మరణించిందని వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, భర్త, ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశారు.

More Telugu News