పోలెండ్ లో విమాన ప్రమాదం... 11 మంది మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలెండ్ లో విమాన ప్రమాదం... 11 మంది మృతి

దక్షిణ పోలెండ్ లోని జస్టిచోవా ప్రాంతంలో ఓ మినీ ప్లేన్ కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. ఓ క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. పోలెండ్ రాజధాని వార్సాకు 207 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విమానం ఓ ప్రైవేటు సంస్థకు చెందినదని తెలుస్తోంది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

More Telugu News