కోర్టు ఆదేశాలతో ఖమ్మం జెడ్పీ ఎన్నికకు బ్రేక్ పడింది
ఖమ్మం జిల్లా పరిషత్, మండల పరిషత్ పరోక్ష ఎన్నికకు హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియకు అవాంతరం ఏర్పడింది. జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతున్నందున జిల్లా పరిషత్, మండల పరిషత్ పదవులకు కేటాయించిన రిజర్వేషన్లను మార్చాలంటూ ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. బూర్గంపాడు జెడ్పీటీసీ గాంధీ, బూర్గంపాడు-2 ఎంపీటీసీ సభ్యుడు రోశిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు జిల్లా పరిషత్, మండల పరిషత్ పదవులకు ఎన్నిక నిలిపి వేయాలని స్టే విధించింది.