35 మంది జాతీయ కాంగ్రెస్ నేతలు... గబ్బిలాల్లా వదలట్లేదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

35 మంది జాతీయ కాంగ్రెస్ నేతలు... గబ్బిలాల్లా వదలట్లేదు

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న నానుడి కాంగ్రెస్ జాతీయ నేతలకు అతికినట్టు సరిపోయేలా ఉంది. పదేళ్ల పాలన చాలు ఇళ్లకు వెళ్లండంటూ ఓటర్లు తీర్పునిచ్చారు. అయినా 35 మంది జాతీయ కాంగ్రెస్ నేతలు మాత్రం ససేమిరా తమ సొంత ఇళ్లకు వెళ్లమంటున్నారు. అధికారిక నివాసాలు ఖాళీ చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఢిల్లీలో సర్కారు మారి నెల దాటింది. అయినా మాజీలు అధికారిక నివాసాలు ఖాళీ చేయడం లేదు.
దీంతో అధికారులు 'ఖాళీ చేయండి బాబూ' అంటూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వారిలో సచిన్ పైలట్, కపిల్ సిబాల్, జైపాల్ రెడ్డి, పళ్లంరాజు, కృష్ణతీర్థ, గిరిజా వ్యాస్, ప్రణీత్ కౌర్, దీపా దాస్ మున్షీ, శ్రీప్రకాశ్ జైస్వాల్, బేణిప్రసాద్ వర్మ, ప్రఫుల్ పటేల్, ఫరూఖ్ అబ్దుల్లా, అజిత్ సింగ్ వంటి ప్రముఖులు కూడా ఉండడం విశేషం.

More Telugu News