టాప్ ర్యాంకుపై కన్నేసిన శ్రీలంక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాప్ ర్యాంకుపై కన్నేసిన శ్రీలంక

ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి మాంచి ఊపుమీదున్న శ్రీలంక వన్డేల్లో నెంబర్ వన్ పొజిషన్ పైనా కన్నేసింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ నెగ్గడం ద్వారా వన్డేల్లో అగ్రస్థానం అవకాశాలను మెరుగుపర్చుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. సఫారీలతో లంక మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. తొలి వన్డే రేపు కొలంబో వేదికగా జరగనుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకుల్లో శ్రీలంక మూడోస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా ఐదోస్థానంలో ఉంది.
ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఖాతాలో 115 పాయింట్లున్నాయి. ద్వితీయస్థానంలో ఉన్న టీమిండియా, తర్వాతి స్థానంలో ఉన్న శ్రీలంక ఖాతాల్లో 112 పాయింట్లు ఉన్నా, దశాంశాల తేడాతో భారత్ రెండో స్థానం దక్కించుకుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ ను నెగ్గడం ద్వారా భారీగా పాయింట్లు కూడగట్టుకుని ఆసీస్ ను సైతం వెనక్కినెట్టాలని లంకేయులు కృతనిశ్చయంతో ఉన్నారు.

More Telugu News