టీమిండియా విజయావకాశాలపై ద్రావిడ్ విశ్లేషణ
భారత జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా నియమితుడైన మేటి బ్యాట్స్ మన్ రాహుల్ ద్రావిడ్ ఇంగ్లండ్ లో గెలుపు అవకాశాలపై విశ్లేషించాడు. టీమిండియా బౌలింగ్ దాడులపైనే విజయం ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ జట్టును టెస్టులో రెండుసార్లు ఆలౌట్ చేయగలిగితేనే ఫలితం సానుకూలంగా ఉంటుందని ద్రావిడ్ సూచించాడు. లార్డ్స్ మైదానంలో బైసెంటినరీ మ్యాచ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, 2007 సిరీస్ ను గుర్తు చేశాడు. ఆ సిరీస్ లో జహీర్ ఖాన్ విశేషంగా రాణించడంతో ఇంగ్లండ్ మెడలు వంచామని తెలిపాడు.
జహీర్ కు మిగతావారి నుంచి చక్కని సహకారం అందిందని ఈ కర్ణాటక బ్యాట్స్ మన్ పేర్కొన్నాడు. లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా మెరుగైన ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడని చెప్పాడు. కాగా, ప్రస్తుత భారత జట్టు పేసర్లలో ఇషాంత్ శర్మ ఒక్కడికే ఇంగ్లండ్ గడ్డపై ఆడిన అనుభవం ఉంది. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, స్టూవర్ట్ బిన్నీలు ఇంగ్లండ్ లో ఆడడం ఇదే ప్రథమం.