గవర్నరుగిరిని వీడి... చెన్నైకి బయల్దేరిన నారాయణన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గవర్నరుగిరిని వీడి... చెన్నైకి బయల్దేరిన నారాయణన్

పశ్చిమ బెంగాల్ గవర్నరు పదవికి రాజీనామా చేసిన నారాయణన్... ఇవాళ కార్యాలయాన్ని వదిలి సతీసమేతంగా చెన్నైకి బయల్దేరారు. కోల్ కతా పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అంతకు ముందు ఆయన రాజ్ భవన్ సిబ్బందిని పేరుపేరునా పలకరించి ధన్యవాదాలు తెలిపారు. రాజ్ భవన్ సిబ్బంది, పలువురు నాయకులు నారాయణన్ కు వీడ్కోలు పలికారు. ఆయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 24వ గవర్నరుగా 2010 జనవరి 24న నియమితులయ్యారు. ఇటీవల అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసుకు సంబంధించి సీబీఐ ఆయనను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆయన గవర్నరు పదవికి రాజీనామా చేశారు.

More Telugu News