ఓ మగవాడి నుంచి మహిళ ఏం ఆశిస్తుందంటే..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓ మగవాడి నుంచి మహిళ ఏం ఆశిస్తుందంటే..!

"మహిళలను అర్థం చేసుకోవడం చాలా కష్టం"... పురుషుల్లో అత్యధికుల అభిప్రాయం ఇదే. పురుషుల కంటే స్త్రీలు త్వరగా పరిపక్వత సాధిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓ అతివ తన మౌనంతో ఎంతో భావ వ్యక్తీకరణ చేయగలదు. అదే, పురుషుడి విషయానికొస్తే గంటలకొద్దీ వాగినా అసలు విషయం సరిగా చెప్పలేరు. ఓ స్త్రీ, మగవాడి నుంచి ఏం ఆశిస్తుందన్న విషయంలో కాస్తంత శ్రద్ధ పెడితే అమ్మాయిలను అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పురుషుడు నిజాయతీపరుడై ఉండాలని భావిస్తారట. ధైర్యం సరేసరి. అయితే, ఒక్కసారి అబద్ధం చెప్పి బుక్కయిపోతే, కొంపమునిగినట్టే. అంతతేలిగ్గా క్షమించరట అమ్మాయిలు. తప్పు ఒప్పుకుంటే మాత్రం ఆమె మనసు కరిగించేందుకు కొన్ని అవకాశాలను సృష్టించుకున్నట్టే. ఇక, ఆమె చెప్పేది అత్యంత శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. స్త్రీతో సుదీర్ఘ బంధం నెరపాలంటే ఇలా చేయకతప్పదు మరి. మీరేమీ ఆమె సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిన అవసరం లేదు. జస్ట్, వినాలి. ఆమె కూడా పరిష్కారాలను ఆశించదు. తను చెప్పేది వినాలని కోరుకుంటుందంతే. మీతో ఆ స్త్రీ భావోద్వేగపరమైన అనుబంధం ఏర్పరచుకునేందుకు అనువుగా మసలుకోవాలి. అన్నింటికన్నా ప్రధానమైనది ఏమంటే... స్త్రీలు, పురుషుల కంటే త్వరగా పరణతి సాధించినా, పురుషుడే తమకంటే గొప్పగా ఉండాలని కోరుకుంటారు. తమ పురుషుడు గొప్పలు కొట్టేవాడు కాకుండా, తగిన నియంత్రణతో, కార్యదక్షత ఉన్న వ్యక్తి అయి ఉండాలని ఆశిస్తారు. ఒకవేళ మీరు సమస్యల నుంచి పారిపోయే వ్యక్తి అయితే, స్త్రీ మనసులో స్థానం కోల్పోయినట్టే.. ఆలోచించుకోండి మరి!

More Telugu News