నువ్వెంతంటే నువ్వెంత... ఘాటు పదజాలం... జేసీ, విశ్వేశ్వరరెడ్డి వాగ్వాదం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నువ్వెంతంటే నువ్వెంత... ఘాటు పదజాలం... జేసీ, విశ్వేశ్వరరెడ్డి వాగ్వాదం

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేత విశ్వేశ్వరరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీని టీడీపీలోకి తీసుకోవడంతో వీరిద్దరి మధ్య వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో ఉరవకొండలో వారిద్దరూ ఎదురు పడడంతో ఒకరినొకరు ఘాటుగా దూషించుకున్నట్టు సమాచారం. 'నువ్వెంత అంటే నువ్వెంత' అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరినీ శాంత పరిచారు.

More Telugu News