ఆ బాత్రూంలోకి వెళ్లాలంటే ఎవరైనా వణకాల్సిందే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ బాత్రూంలోకి వెళ్లాలంటే ఎవరైనా వణకాల్సిందే

ఆ బాత్ రూం లోకి వెళ్తే ఎవరైనా వణకాల్సిందే... ఎందుకంటే, అది సముద్రమట్టానికి 8,500 అడుగుల ఎత్తులో... కొండ అంచున... ఎప్పుడు పడిపోతుందో తెలియని స్థితిలో ఉంటుంది. సైబీరియాలోని కారట్యూరెక్ లో ఉన్న అల్టాయ్ పర్వతాల్లో ఈ మరుగుదొడ్డి ఉంది. ఒకేసారి ఈ బాత్రూంలో ఇద్దరు దూరితే కూలిపోతుందేమో అనేంత భీతిగొల్పేలా ఉంటుంది. దీనిని వాతావరణ కేంద్రం ఉద్యోగులు 1939లో నిర్మించారు.
ఈ కేంద్రంలో కేవలం ఐదుగురు ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు. భయం పుట్టించే బాత్ రూంల పోటీలో ఇది మొదటి స్థానంలో నిలిచిందని బెలారస్ కు చెందిన ఇంటర్ ఫ్యాక్స్ న్యూస్ ఏజెన్సీ నిర్వహించిన సర్వేలో తేలింది. ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, ఈ బాత్రూంలోకి పోవాలంటే ఎవరైనా వణకాల్సిందేనని చెప్పాడు. అయితే రోజూ ఉపయోగిస్తూ పోతే అలవాటు పడిపోతారని, లేదంటే ఎవరైనా భయపడాల్సిందేనని ఆయన స్పష్టం చేస్తున్నాడు. ఈ బాత్ రూం కట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మత్తులు చేయకపోవడం విశేషం.

More Telugu News