కేంద్రంపై నిప్పులు చెరిగిన కరుణానిధి
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణియం నియామకాన్ని కేంద్రం తిరస్కరించడంపై డీఎంకే అధినేత కరుణానిధి మండిపడ్డారు. గుజరాత్ లో జరిగిన సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్ కౌంటర్ కేసు విచారణలో సుబ్రమణియం కీలకపాత్ర పోషించడమే కేంద్రం నిర్ణయానికి కారణమై ఉంటుందని దుయ్యబట్టారు. సొహ్రాబుద్దీన్ కేసులో సుబ్రమణియం అమికస్ క్యూరీగా వ్యవహరించారని, తదనంతరం మోడీ సన్నిహితుడు అమిత్ షాను సీబీఐ అరెస్టు చేసిందని కరుణ వివరించారు. సుబ్రమణియం నియామకం తిరస్కరణకు గురవడానికి ఇదే కారణమై ఉంటుందా? అని సందేహం వ్యక్తం చేశారు. ఏదేమైనా తమిళనాడుకు ఓ మంచి అవకాశం చేజారిపోయిందని విచారం వ్యక్తం చేశారు.