గోవా గవర్నర్ ను ప్రశ్నించనున్న సీబీఐ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోవా గవర్నర్ ను ప్రశ్నించనున్న సీబీఐ

అగస్టా వెస్ట్ ల్యాండ్ తో మూడువేల ఆరువందల కోట్ల రూపాయల వీవీఐపీ చాపర్ ఒప్పందానికి సంబంధించిన లంచం కేసులో సీీబీఐ దర్యాప్తు చకచకా సాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు గోవా గవర్నర్ బీవీ వాంచూను సీబీఐ ప్రశ్నించనుంది. ఈ కేసులో ఆయనకు సంబంధించిన విషయాలను అధికారులు అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ ఎంకే నారాయణన్ తో పాటు పలువురిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

More Telugu News