ట్యాంక్ బండ్ మీద అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు
మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. హైదరాబాదులోని ట్యాంక్ బండ్ మీద విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, అల్లూరికి చంద్రబాబు పూలమాల వేసి నమస్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు నేతలు, అధికారులు హాజరయ్యారు.