తృణమూల్ ఎంపీని క్షమించమంటున్న రాష్ట్రపతి కుమారుడు
'అత్యాచార' అనుచిత వ్యాఖ్యలు చేసి కలకలం రేపిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ ను క్షమించమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజీత్ ముఖర్జీ కోరుతున్నారు. ఈ మేరకు ఆయనను సమర్థించిన అభిజీత్... ఎంపీ క్షమాపణ చెప్పినందున వదిలేయాలంటున్నారు. తపస్ ఇప్పటికే లేఖ ద్వారా పార్టీకి క్షమాపణ చెప్పారని, అప్పుడు పార్టీ ఆయనకు క్షమాభిక్ష పెడుతుందనుకుంటున్నానని చెప్పారు. పలుసార్లు నాలుక జారి కొన్ని మాటలు వస్తాయని... కానీ, ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం రాకూడనివని అభిజీత్ అభిప్రాయపడ్డారు. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకూడదని తాను ఆశిస్తున్నానన్నారు.