Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓపెనర్లు ఫెయిలైనా.. భారత్ కు స్వల్ప ఆధిక్యం!

డెర్బీషైర్ జట్టుతో ప్రాక్టీసు మ్యాచ్ లో టీమిండియాకు 15 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఓపెనర్లు ధావన్ (6), విజయ్ (6) స్వల్ప స్కోర్లకు వెనుదిరిగినా, పుజారా (81 రిటైర్డ్), బిన్నీ (81బ్యాటింగ్) చలవతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 341 పరుగులు చేసింది. అంతకుముందు, డెర్బీషైర్ తొలి ఇన్నింగ్స్ ను 5 వికెట్లకు 326 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కాగా, టీమిండియా ఇన్నింగ్స్ లో మిడిలార్డర్ రాణించింది. కోహ్లీ (36), ధోనీ (46), జడేజా (45) బ్యాట్లకు పనిచెప్పడంతో కౌంటీ బౌలర్లు తేలిపోయారు.

More Telugu News