చెన్నై ఘటనలో 54కి చేరిన మృతుల సంఖ్య
చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 54 మృత దేహాలను శిథిలాల కింద నుంచి వెలికితీశారు. వీరిలో 23 మంది తెలుగువారు ఉన్నారు. శిథిలాలను పూర్తిగా తొలగించడానికి మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.