ఇన్ఫోసిస్ సీఈవో వేతనం ఏడాదికి రూ.30 కోట్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇన్ఫోసిస్ సీఈవో వేతనం ఏడాదికి రూ.30 కోట్లు

ఇన్ఫోసిస్ సంస్థకు కొత్త సీఈవోగా నియమితులైన విశాల్ సిక్కా ఏడాదికి 5.08 మిలియన్ డాలర్ల వేతనాన్ని అందుకోనున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.30.48 కోట్లు. దీంతో పాటు రూ.12 కోట్ల స్టాక్ ఆప్షన్ కూడా ఉంటుంది. అయినా, ఈ ప్యాకేజీ ఇతర దేశాల్లో ఆయనతో సమాన హోదాలో పనిచేసే వారితో పోలిస్తే తక్కువేనని కార్పొరేట్ వర్గాలు అంటున్నాయి. విశాల్ సిక్కా ఆగస్టు ఒకటో తేదీ నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు.

More Telugu News