Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదులో వర్షం

హైదరాబాదు నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, వనస్థలిపురంలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అమీర్ పేట, కూకట్ పల్లిలోనూ జల్లులు పడుతున్నాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో వేడెక్కిన వాతావరణం, సాయంకాలం జల్లులు పడటంతో ఒక్కసారిగా చల్లబడింది. దీంతో నగరవాసులకు ఎండ నుంచి ఉపశమనం లభించినట్లయింది.

More Telugu News