Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రాల ఆర్ధికమంత్రులతో ఎల్లుండి కేంద్రం సమావేశం

రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో ఎల్లుండి (3వ తేదీ) కేంద్రం సమావేశం కానుంది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానంపై కేంద్రం మంత్రులతో చర్చించనుంది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఏపీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ఈ సమావేశానికి హాజరవుతారు.

More Telugu News