పొరబాటుకు సారీ చెప్పిన రాజమౌళి... ఎఫ్ బీలో లైక్స్ వెల్లువ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పొరబాటుకు సారీ చెప్పిన రాజమౌళి... ఎఫ్ బీలో లైక్స్ వెల్లువ

చిరంజీవితో 'స్టాలిన్' సినిమాకు కూడా వినాయక్ అంతకష్టపడి ఉండడని 'అల్లుడు శీను' ఆడియో ఫంక్షన్ లో పేర్కొన్న రాజమౌళి పొరబాటును సవరించుకున్నారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ పేజీలో సారీ చెప్పారు. 'ఠాగూర్' అని చెప్పబోయి 'స్టాలిన్' అని పలికానని తన పోస్టింగ్ లో వివరణ ఇచ్చారు. కాగా, అపాలజీ పోస్ట్ చేసిన అరగంటకే 1000కి పైగా లైక్స్ వచ్చిపడ్డాయి. రాజమౌళి ఏం చేసినా సంచలనమే మరి!

More Telugu News