జులై 2న తెలంగాణ శాసనమండలి సమావేశం
తెలంగాణ శాసనమండలి జులై 2న సమావేశం కానుందని అసెంబ్లీ కార్యదర్శి సదారాం తెలిపారు. అదే రోజు ఉదయం 11 గంటలకు మండలి ఛైర్మన్ ఎన్నిక ఉంటుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఛైర్మన్ ఎన్నిక విధానం, నామినేషన్ పత్రాల దాఖలు గురించి తెలుపుతూ ఆయన సభ్యులకు వ్యక్తిగతంగా లేఖలు రాసినట్టు తెలిపారు. కాగా, రేపు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మండలి ఛైర్మన్ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది.