ప్రధానిగా తొలిసారి కాశ్మీర్లో పర్యటించనున్న మోడీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రధానిగా తొలిసారి కాశ్మీర్లో పర్యటించనున్న మోడీ

ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోడీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించబోతున్నారు. వచ్చే నెల 4న ఆయన ఒక్క రోజు పర్యటనలో భాగంగా జమ్మూకి వెళతారు. జమ్మూకి సమీపంలోని కాత్రా పట్టణంలో... కాత్రా-ఉదంపూర్ మధ్య రైలు సర్వీసును ప్రారంభిస్తారు. వైష్ణోదేవి భక్తులకు ఈ పట్టణం ముఖ్య కేంద్రం. కాత్రా-ఉదంపూర్ రైలు సర్వీసు ప్రారంభంతో భక్తులు నేరుగా వైష్ణోదేవి ఆలయానికి చేరుకోవడం సులభమవుతుంది. మోడీ వెంట రైల్వే మంత్రి సదానందగౌడ, ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద్రసింగ్ ఉంటారు. రైలు సర్వీసును ప్రారంభించిన అనంతరం మోడీ శ్రీనగర్ వెళతారు. అక్కడ భద్రతపై సైనికాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దీనికి సీఎం, గవర్నర్ కూడా హాజరవుతారు.

More Telugu News