ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ ఫైనల్లో సైనా
ఇండియన్ టాప్ షట్లర్ సైనా నెహ్వాల్ మరో మైలురాయికి చేరువైంది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. సెమీస్ లో చైనా క్రీడాకారిని వాంగ్ పై 21-19, 16-21, 21-15 తేడాతో సైనా విజయం సాధించింది. దీంతో, సూపర్ టైటిల్ గెలుపొందేందుకు సైనా మరో అడుగు దూరంలో నిలిచింది.