బాధితులను పరామర్శించిన చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాధితులను పరామర్శించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చేరుకున్నారు. గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ప్రమాద బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయన వెంట కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఓఎన్జీసీ, గెయిల్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. జరిగిన ఘటనను ఓ దారుణమైన ఘటనగా ఆయన అభివర్ణించారు.

More Telugu News