శ్రీవారి ప్రసాదాలు అధిక ధరకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
తిరుమల శ్రీవారి ప్రసాదాలు అధిక ధరకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టైంది. ఈ వ్యవహారంలో ముఠా నాయకుడిగా ఉన్న టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరిస్తున్న మరో నలుగురు టీటీడీ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు.