మరో 14 జిల్లాలు ఏర్పాటు చేస్తాం: నాయిని
తెలంగాణలో త్వరలోనే మరో 14 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతామని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల యూనిఫాం పూర్తిగా మారుస్తున్నామని అన్నారు. ఇకపై హైదరాబాద్ అంటే ప్రతి విషయంలో విభిన్నంగా ఉంటుందని ఆయన తెలిపారు.