తల్లిదండ్రుల నిస్సహాయత...బాలిక నిండు ప్రాణం తీసింది
పుస్తకాలు, పెన్సిల్ కూడా కొనివ్వలేని తల్లిదండ్రుల నిస్సహాయత ఓ బాలిక నిండు ప్రాణాన్ని హరించింది. గుండెల్ని తొలిచి వేసే ఈ ఘటన ఒడిషాలోని గంజాం జిల్లా ఆస్క పట్టణంలో చోటు చేసుకుంది. నిరుపేద బిజోనాయక్ కు ఇద్దరు ఆడపిల్లలు. రోజు కూలీగా పనిచేసే అతనికి పక్షవాతం రావడంతో ఉపాధి కోల్పోయాడు. దానికి తోడు వైద్యం, మందుల ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీంతో అతని భార్య నాలుగిళ్లలో పని చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది. వారి పెద్ద కుమార్తె జయంతి (14) ఇటీవలే ఏడవ తరగతిలో ప్రవేశించింది.
స్కూళ్లు ప్రారంభం కావడంతో పెన్సిళ్లు, పుస్తకాలు కావాలని తల్లిదండ్రులను అడిగింది. తమ వద్ద అంత డబ్బు లేదని, కొన్నాళ్లు సర్దుకుంటే తరువాత కొనిస్తామని చెప్పారు. దీంతో ఏవీ లేకుండా స్కూలుకెళ్లడం అవమానంగా భావించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేయడంతో స్థానికులు మంటలార్పి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జయంతి మృతి చెందింది.