Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిడ్నీ క్యాన్సర్ మూలం మెదడులోనే ఉంటుందట!

క్యాన్సర్ అంటేనే ప్రాణాంతకం, మరి కిడ్నీ క్యాన్సర్ అంటే ఇక చెప్పనక్కర్లేదు! అలాంటి అత్యంత ప్రమాదకర వ్యాధికి మూలం మన మెదడు అభివృద్ధికి తోడ్పడే ఓ జన్యువు అంటే నమ్మగలరా? కానీ, ఇది నిజం అంటున్నారు అమెరికాలోని మేయో క్లినిక్ కు చెందిన మాలిక్యులర్ బయాలజిస్ట్ జాన్ కోప్లాండ్. కిడ్నీ క్యాన్సర్ కణాల తయారీలో ఈ జన్యువుదే కీలకపాత్ర అని కోప్లాండ్ వివరించారు. ఎన్టీపీఎక్స్2 అనే ఈ జన్యువు కిడ్నీ క్యాన్సర్ నే కాకుండా ఇతర రకాల క్యాన్సర్లనూ కలిగిస్తుందని తెలిపారు.

ఈ జన్యువు ఎందుకు క్యాన్సర్ ను కలిగిస్తుందో తెలియదని, అయితే, క్యాన్సర్ కారక జన్యువుగా దీని పాత్ర ఏమిటన్నది మాత్రం తెలుసుకున్నామని కోప్లాండ్ చెప్పారు. కాగా, ఈ పరిశోధనల కోసం 100 మంది కిడ్నీ క్యాన్సర్ రోగుల జన్యు పటాలను పరిశీలించి ఈ వివరాలు వెల్లడించారు.

More Telugu News