ఏపీకు త్వరలో 500 మెగావాట్ల విద్యుత్ కేటాయిస్తున్నాం: పియూష్ గోయల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీకు త్వరలో 500 మెగావాట్ల విద్యుత్ కేటాయిస్తున్నాం: పియూష్ గోయల్

ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విద్యుత్ కు కటకట ఏర్పడిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ ను కలసి మాట్లాడిన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం మీడియాతో వివరంగా మాట్లాడిన మంత్రి, దేశ వ్యాప్తంగా అన్ని గృహాలకు విద్యుత్ అందించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. త్వరలో ఏపీ రాష్ట్రంలో ఫైలట్ ప్రాజెక్టును అమలు చేస్తామని తెలిపారు. అలాగే ఏపీ రాష్ట్రానికి 500 మెగావాట్ల విద్యుత్ కేటాయిస్తున్నట్టు గోయల్ ప్రకటించారు. ఆ మొత్తం ఓ మూడు నెలల్లో అందజేస్తామని చెప్పారు. కాగా, విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదాలు నెలకొన్నాయన్నారు. వాటిని ఏపీ పునర్విభజన చట్టం ఆధారంగా పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే దేశ వ్యాప్తంగా విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.

More Telugu News