షారూఖ్ కంటికి శస్త్రచికిత్స
బాలీవుడ్ సూపర్ హీరో షారూఖ్ ఖాన్ కంటికి శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల ఆయనకు దృష్టిలోపం తలెత్తడంతో ముంబయిలో స్వల్ప సర్జరీ నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం షారూఖ్ ట్విట్టర్లో స్పందించారు. లైన్ల మధ్యలో కూడా ఇప్పుడు స్పష్టంగా చదవగలుగుతున్నానని సరదాగా ట్వీట్ చేశారు. కళ్ళజోడు అవసరం లేకుండా బాటిల్ లో మందు తాగేస్తానని కూడా చమత్కరించారు. కాగా, తన కంటికి ఆపరేషన్ చేసిన డాక్టర్ బుర్జోర్ బనాజీ దంపతులకు షారూఖ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బ్లాక్ బస్టర్ హీరో తాజాగా ఫరా ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రంలో నటిస్తున్నారు.