ఫ్యాన్స్ కు సల్మాన్ ఉపాధి హామీ పథకం
బాలీవుడ్ కండలరాయుడు సల్మాన్ ఖాన్ ఉదారత గురించి తెలియనివారుండరు. కష్టాల్లో ఎవరైనా ఉంటే ఇట్టే కరిగిపోతాడని సల్లూభాయ్ కి పేరు. తాజాగా ఈ ఖాన్ హీరో తన అభిమానుల కోసం ఓ జాబ్ పోర్టల్ ప్రారంభించాడు. తన అభిమానుల్లో అత్యధికులు ఉద్యోగాలు లేకుండా ఉండడాన్ని ఈ ఎలిజబుల్ బ్యాచిలర్ భరించలేకపోయాడు. వెంటనే వారికోసం ఓ వేదిక ఏర్పాటు చేశాడు. అందులో రిజిస్టర్ అయిన నిరుద్యోగ అభిమానులకు ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ మేరకు తన మిత్రులకు సల్మాన్ విజ్ఞప్తి చేశాడట.
వారివారి కంపెనీల్లో ఉన్న ఖాళీలను తన ఫ్యాన్స్ తో భర్తీ చేయాలని వారిని కోరానని సల్మాన్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. తన 'బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్' ద్వారా ఈ ఏర్పాటు చేశాడీ స్టార్ హీరో. ఆ జాబ్ పోర్టల్ లింక్ ఇదిగో... http://www.beinghumanworkshop.com.