మోడీ సర్కారుపై 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' రవిశంకర్ జీ వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోడీ సర్కారుపై 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' రవిశంకర్ జీ వ్యాఖ్యలు

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రక్రియతో దేశవిదేశాల్లోని ఎందరో ప్రముఖులను తన శిష్యులుగా మలుచుకున్న శ్రీ శ్రీ రవిశంకర్ జీ మోడీ సర్కారు తీరుతెన్నులపై స్పందించారు. వాషింగ్టన్ డీసీలో పీటీఐతో మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం వేళ ఇచ్చిన హామీలను మోడీ నెరవేర్చుతారని తాను విశ్వసిస్తున్నట్టు తెలిపారు. 'ఆయన ట్రాక్ రికార్డు చూస్తే అర్థమవుతుంది. గతంలోనూ ఇలాంటివి ఎన్నో మంచిపనులు చేశారు. కష్టపడి పనిచేస్తున్నారు, వ్యవస్థను గాడినపెట్టేందుకు ఆయనకు కొంత సమయం ఇవ్వాలి' అని రవిశంకర్ పేర్కొన్నారు.

దేశ పురోగతి కోసం మోడీ అన్ని వర్గాల ప్రజలను పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. పనిలోపనిగా భారత్, పాకిస్థాన్ సంబంధాలపైనా స్పందించారు. రెండు దేశాలు అణ్వస్త్ర సహిత దేశాలేనని, కలహం సమస్యకు పరిష్కారం కాదని రెండు దేశాలకు తెలుసని పేర్కొన్నారు. రెండు దేశాల అధినేతలు యుద్ధానికి దిగేంత మూర్ఖులు కారన్నది వాస్తవం అని ఉద్ఘాటించారు.

More Telugu News