కర్నూలు మృతుల కుటుంబాలకు ఉపముఖ్యమంత్రి సంతాపం
కర్నూలు జిల్లాలో ఇసుక మాఫీయా ఘాతుకానికి ఐదుగురు రెవెన్యూ సిబ్బంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ మృతుల కుటుంబాలకు ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంతాపం తెలిపారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకి తరలిస్తామన్నారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం నున్నూరు వద్ద నిట్ ఏర్పాటుకు స్థలం పరిశీలించి రోడ్డు పక్కన నిలుచుని ఉన్న రెవెన్యూ అధికారులపై అటుగా వస్తున్న ఇసుక లారీ ఢీ కొట్టింది. దాంతో, అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు. గాయపడిన వారిలో ఇద్దరు సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.