వీడు బాలుడా... బాబోయ్ తాగుబోతు!
రెండేళ్ల బాలుడి వ్యవహారం చైనాలో దుమారం రేపుతోంది. పాలిస్తే 'యాక్' అంటూ ముఖం తిప్పేసుకునే ఈ బాలుడు మద్యం కనబడితే చాలు పండగ చేసుకుంటాడట. చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్ లో ఉండే రెండేళ్ల బాలుడు చెంగ్ చెంగ్ గురించి ఆ ప్రాంతంలో చర్చించని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. చెంగ్ చెంగ్ కి పది నెలల వయసున్నప్పుడు గుక్కపట్టి ఏడుస్తుంటే వాడి బాధ భరించలేక వాళ్ల నాన్న వైన్ చుక్క నాకించాడట. అంతే, చెంగ్ చెంగ్ ఆ రుచికి అలవాటుపడిపోయాడు.
ఏడాది వయసు వచ్చేసరికి బీరు అలవాటైంది. ఇప్పుడు ఒక బీరు బాటిల్ ను ఈజీగా లేపేస్తాడు. పొరపాటున ఇంట్లో పార్టీ ఉంటే చాలు మనోడికి పండగే... వీడు చేసే మారాం తట్టుకోలేక మందు ఇవ్వాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. వీడి వ్యవహారం ఆ నోటా, ఈ నోటా పాకి మీడియా దృష్టిలో పడింది. వారు చెంగ్ చెంగ్ వ్యవహారాన్ని టీవీలో చూపించారు. అంతే, చైనా మొత్తం దుమారం రేగింది.
చిన్ని పిల్లాడిని పాడు చేస్తున్నారంటూ తల్లిదండ్రులపై అంతెత్తున ఎగసి పడుతున్నారు. బాలుడితో మందు మాన్పించేందుకు ఏం చేయాలా? అని అక్కడి అధికారులు నిపుణులను సంప్రదిస్తున్నారు. తల్లిదండ్రుల వల్లే చెంగ్ చెంగ్ పాడైపోయాడని, అతడిని ప్రభుత్వ సంరక్షణాలయంలో ఉంచాలని స్వచ్చంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.