కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి: ఎంపీ రాపోలు
కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ (రాజ్యసభ) రాపోలు ఆనంద భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడకు లేఖ రాశారు. అలాగే, సూర్యాపేట మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాజీపేటలో రైల్వే వాగన్ వర్క్ షాప్ పనులను వేగవంతం చేయాలని ఎంపీ కోరారు.