మెస్సీపై మనసు పారేసుకున్న టెన్నిస్ బ్యూటీ
బెలారస్ టెన్నిస్ క్వీన్ విక్టోరియా అజరెంకా ఇప్పుడు సాకర్ ఫీవర్ తో ఊగిపోతోంది. బ్రెజిల్ లో జరుగుతున్న వరల్డ్ కప్ లో తన సొంత దేశం బెలారస్ కు కాకుండా ఆమె అర్జెంటీనా జట్టుకు జై కొట్టడం విశేషం. అందుకు బలమైన కారణమే ఉందండోయ్. అర్జెంటీనా స్టార్ ఫార్వర్డ్ లియొనెల్ మెస్సీ ఈ మాజీ నెంబర్ వన్ ను విశేషంగా ఆకట్టుకున్నాడట. అందుకే తన ఓటు అర్జెంటీనాకే అంటోందీ సొగసరి.