సినీ నటి గీతికా త్యాగి లైంగిక వేధింపుల కేసులో దర్శకుడికి బెయిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినీ నటి గీతికా త్యాగి లైంగిక వేధింపుల కేసులో దర్శకుడికి బెయిల్

బాలీవుడ్ నటి గీతికా త్యాగిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన బాలీవుడ్ దర్శకుడు సుభాష్ కపూర్ బెయిలుపై విడుదలయ్యారు. జాలీ ఎల్ఎల్ బీ సినిమాకు దర్శకత్వం వహించిన సుభాష్ కపూర్, అతని అనుచరుడు ధనీష్ రాజాతో కలిసి 2012 మేలో ముంబైలోని వెర్సోవాలో ఆత్మ, వాట్ ద ఫిష్, వన్ బై టు సినిమాల్లో నటించిన గీతికా త్యాగి నివాసానికి వెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గత ఏప్రిల్ లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు సుభాష్ ప్రయత్నించాడని ఆమె పేర్కొన్నారు. దీంతో ఆయనను పోలీసులు సోమవారం అరెస్టు చేసి అంధేరీ కోర్టులో ప్రవేశపెట్టారు. అంధేరీ కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది.

More Telugu News